తీవ్ర వాయుగుండంగా 'ఫాని'

తీవ్ర వాయుగుండంగా 'ఫాని'

పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కేంద్రీకృతమైన సూపర్ సైక్లోన్ 'ఫాని'.. తీవ్రవాయుగుండగా మారింది. గంటలకు 25 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్య దిశగా ప్రయాణించి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మధ్యాహ్నానికి బాంగ్లాదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న గాంగ్‌టాక్‌ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కృష్ణానగర్ (పశ్చిమ బెంగాల్)కు తూర్పు ఈశాన్య దిశగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఈశాన్య దిశగా ప్రయాణించి బలహీనపడి బంగ్లాదేశ్‌లో వాయుగుండముగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఒడిశాలో తీరాన్ని దాటిన ఫాని తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టించింది. భారతీయ ఉపఖండంలో విధ్వంసం సృష్టించిన భారీ తుఫాన్లలో ఫాని ఒకటిగా చెబుతున్నారు. ఇక శనివారం రాత్రి బెంగాల్లో తుఫాను ధాటికి తీవ్రనష్టం వాటిల్లింది.