తీరాన్ని తాకిన 'నిసర్గ' తుపాను.. 130 ఏళ్ల తర్వాత...

తీరాన్ని తాకిన 'నిసర్గ' తుపాను.. 130 ఏళ్ల తర్వాత...

నిస‌ర్గ తుఫాన్‌.. తీరాన్ని తాకింది.  మ‌హారాష్ట్రలోని అలీబాగ్ వద్ద తీరం దాటే సమయంలో గంటకు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టుగా చెబుతున్నారు.. ఇక, పరిసర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది.. మ‌రో మూడు గంట‌ల్లో నిస‌ర్గ సంపూర్ణంగా తీరం దాట‌నున్నట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ ప్రకటించింది.. వచ్చే మూడు గంటల్లో తుఫాను క్రమంగా ముంబై మరియు థానే జిల్లాల్లోకి ప్రవేశిస్తుందని ఐఎండీ చెబుతోంది... మహారాష్ట్ర తీర ప్రాంతం .. రాయ్‌గడ్ జిల్లా గుండా వెళ్లనుంది అని అంచనా వేస్తున్నారు.. ఇక, తుపాను యొక్క వేగం ప్రస్తుతం గంటకు 100-110 కిలోమీటర్లు వేగంలో ఉందని చెబుతున్నారు. ఇక, 130 ఏళ్ల తర్వాత ముంబై తీరాన్ని తాకనుంది తుపాను.. దీంతో... అప్రమత్తమైన అధికారులు... ముంబైలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల‌ను, తీర ప్రాంత ప్రజలను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. 48 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దింపారు.