సిక్కోలుపై విరుచుకుపడుతున్న 'తిత్లీ' తుఫాన్

సిక్కోలుపై విరుచుకుపడుతున్న 'తిత్లీ' తుఫాన్

తీరం దాటిన తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడుతోంది... మరో నాలుగు గంటల పాటు 160 కిలో మీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి  సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. తిత్లీ బీభత్సంతో ఇవాళ అంబేద్కర్ యూనివర్శిటీలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు అధికారులు... మరోవైపు విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఒకరోజు సెలవు ప్రకటించారు. మరోవైపు బోగాపురం వద్ద.... శ్రీకాకుళం, కోల్‌కతా వైపు వెళ్లే జాతీయ రహదారని మూసివేశారు. కేవలం శ్రీకాకుళం వరకు వేళ్లే బస్సులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.