నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

అధిక స్థాయిల్లో మార్కెట్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఏమాత్రం చిన్న ప్రతికూల వార్త వచ్చినా వెంటనే స్పందిస్తోంది. రాఫెల్‌పై సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చిన తరవాత నుంచి మార్కెట్‌ పడుతూనే వచ్చింది. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 25 పాయింట్ల నష్టంతో 11,646 వద్ద ప్రారంభమైంది. తరవాత మిడ్‌సెషన్‌కల్లా 11,680కి చేరింది. ఈలోగా రాఫెల్‌పై సుప్రీం ఆదేశానికి సంబంధించి పూర్తి సమాచారం అందడంతో మార్కెట్‌లో ఒత్తిడి పెరిగింది. అప్పుడే ప్రారంభమైన యూరో మార్కెట్లు స్పష్టంగా లాభాల్లో ఉన్నా... అమ్మకాలు జోరు మాత్రం కొనసాగింది. ఒకదశలో 11,571కి పడిపోయి... 11,584 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 88 పాయింట్లు క్షీణించగా, సెన్సెక్స్‌ 353 పాయింట్లు తగ్గింది. నిఫ్టి ప్రధాన షేర్లలో టాటా మోటార్స్‌, సిప్లా, విప్రో, అదానీ పోర్ట్స్‌, హిందుస్థాన్‌ లీవర్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లలో... భారతీ ఎయిర్‌టెల్‌, హిందాల్కో, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, యూపీఎల్‌ ఉన్నాయి. ఇతర షేర్లలో ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్ 11 శాతం పెరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, ఇన్ఫీబీమ్‌, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌, నవ్‌కార్‌ కార్పొరేషన్‌, పీసీ జ్యువల్లర్స్‌ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. నష్టపోయిన సెన్సెక్స్‌ షేర్లలో టాటా స్టీల్‌ (పీపీ) ఆర్‌కామ్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, సెంచురీ ప్లే, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ షేర్లు ఉన్నాయి.