ఏప్రిల్ నుంచి దబాంగ్ 3 షురూ..

ఏప్రిల్ నుంచి దబాంగ్ 3 షురూ..

సల్మాన్ ఖాన్ దబాంగ్ సీరీస్ లో ఇప్పటి వరకు  2 సినిమాలు వచ్చాయి.  రెండు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  దబాంగ్ 3 సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు యూనిట్ రెడీ అవుతున్నది.  గతంలో ఈ సినిమా గురించి అనేక వార్తలు వచ్చాయి.  దబాంగ్ 3 ఆలోచనను సల్మాన్, నిర్మాత అర్బాజ్ ఖాన్ విరమించుకున్నారని వార్తలు వచ్చాయి.  ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.  

నిర్మాత అర్బాజ్ ఖాన్ రీసెంట్ గా ఓ జాతీయ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దబాంగ్ 3 గురించిన అనేక విషయాలను మీడియాతో పంచుకున్నాడు.  దబాంగ్ 3 కు అన్ని సిద్ధం అయ్యాయని, ఏప్రిల్ మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు.  దబాంగ్ సీరీస్ షూట్ ఎక్కడ జరిగిందో.. అదే లొకేషన్స్ లో అంటే మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుంది.  అక్కడే కొంత పార్ట్ షూట్ చేస్తారు.  అక్కడి నుంచి వాయ్, ముంబై లో షూటింగ్ చేస్తారు.  ఏప్రిల్ నుంచి నాలుగు నెలల్లో అంటే ఆగష్టు వరకు షూటింగ్ కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అర్భాజ్ ఖాన్ తెలిపారు.  

ఈ ఏడాది క్రిస్మస్ కు సినిమాను రిలీజ్ చేస్తారట.  దర్శకుడు ప్రభుదేవా స్ట్రీట్ డ్యాన్స్ బిజీలో ఉన్నాడని, మార్చి లో ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత... దబాంగ్ 3 పనులు మొదలౌతాయని అర్బాజ్ ఖాన్ తెలిపారు.