చచ్చిపోతున్నా... సుబ్బయ్య

చచ్చిపోతున్నా... సుబ్బయ్య

గుంటూరు జిల్లా దాచేపల్లిలో కామంతో కళ్ళుమూసుకుపోయిన దుర్మార్గుడు అన్నం సుబ్బయ్య(50) అభంశుభం తెలియని మనవరాలు వయసున్న 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.  బాలిక తల్లిదండ్రులకు ఆలస్యంగా విషయం తెలియడంతో.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈలోగా సుబ్బయ్య పారిపోయాడు. అయితే తాజాగా వృద్ధుడు సుబ్బయ్య తన బంధువులకు ఫోన్ చేసి.. తాను  చనిపోతున్నట్టు చెప్పాడు. బుధవారం రాత్రి సుబ్బయ్య బందువులకు ఫోన్ చేయగా.. ఎందుకు ఈ అత్యాచారం చేశావని అడిగారు. దానికి సమాధానం ఇవ్వకుండా.. తాను చనిపోతున్నానని వెల్లడించినట్టు  తెలుస్తోంది. ఇదే విషయాన్ని బంధువులు పోలీసులకు తెలిపారు. సుబ్బయ్య సెల్ ఫోన్ సిగ్నల్ కృష్ణానది తీర గ్రామమైన తంగెడ సెల్ టవర్ ను చూపించింది. దీంతో సుబ్బయ్య నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చన్న కోణంలో.. పోలీసులు నదిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.