వైసీపీకి దగ్గుబాటి రాజీనామా ?

వైసీపీకి దగ్గుబాటి రాజీనామా ?

పొలిటికల్‌ కెరీర్‌పై దగ్గుబాటి వెంకటేశ్వర్రావు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దగ్గుబాటి దంపతులు చెరో పార్టీలో ఉండటంపై వైసీపీ అధిష్టానం ఇటీవల కండీషన్ పెట్టింది. పురంధేశ్వరి కూడా వైసీపీలో చేరాలని, లేకపోతే మీదారి మీరు చూసుకోండంటూ సీఎం జగన్ దగ్గుబాటికి నేరుగా చెప్పేసినట్టు సమాచారం.  దీనిపై ఆయన కుటుంబంలో చర్చ జరిగింది.  వైసీపీ అధిష్టానం తీరుపై దగ్గుబాటి మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. వైసీపికి గుడ్ బై చెప్పాలని ఆయన ఫైనల్‌ డెసిషన్‌ తీసుకున్నట్టు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో సీఎం జగన్ ని కలిసి వెంకటేశ్వర్రావ్‌ ఇదే మాటను చెప్పనున్నట్టు సమాచారం. అలాగే తనను కలిసేందుకు వైసీపీ కార్యకర్తలు అనుచరులు రావొద్దని కూడా ఈ సాయంత్రం జరిగిన సమావేశంలో చెప్పేసినట్టు తెలుస్తోంది.