సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: పురంధేశ్వరి

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: పురంధేశ్వరి

విశాఖ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని బీజేపీ నేత దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పురంధరేశ్వరి విశాఖలో మాట్లాడుతూ... టిక్కెట్ ఇచ్చినందుకు అమిత్ షాకు కృతజ్ణతలు తెలిపారు. తన రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగిందన్నారు. దశాబ్ధాల కాలం నాటి సమస్యల పరిష్కారానికి విశాఖ ఎంపీగా కృషి చేసా. బిహెచ్ పివీ, బిహెచ్ ఇఎల్ విలీనం, పోర్ట్ లో మాస్టర్ లిస్ట్ ప్రకటన, మరెన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేసా.. ఇంకా కృషి చేస్తానన్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయ స్దాయికి పెంచడంలో నా కృషి ఎంతో ఉంది. విశాఖ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో శక్తి మేరకు కృషి చేసానన్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని పురంధేశ్వరి విశాఖ ప్రజలను కోరారు.