వైసీపీకే కాదు రాజకీయాలకి కూడా గుడ్ బై ?

వైసీపీకే కాదు రాజకీయాలకి కూడా గుడ్ బై ?


దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో కొనసాగాలని భావిస్తే... బీజేపీలోని ఉన్న పురంధేశ్వరి కూడా పార్టీలోకి రావాలని సీఎం జగన్ దగ్గుబాటి కుటుంబానికి షరతు విధించినట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో దగ్గుబాటి వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారని దీనిపై వైసీపీ ముఖ్య నేతలకు ఫోన్లోనే తన నిర్ణయాన్ని చెప్పినట్టు సమాచారం.

వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రత్యేకంగా ప్రకటించేందుకు కూడా దగ్గుబాటి ఇష్టపడం లేదని తెలుస్తోంది. ఇకపై ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాలకు దూరంగా ఉండాలని దగ్గుబాటి నిర్ణయించుకున్నట్టు సమాచారం. తనకు సమాచారం ఇవ్వకుండా గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేసిన రఘునాథం బాబును తిరిగి పార్టీలోకి తీసుకోవడం దగ్గుబాటి అంసతృప్తికి కారణమైందని నియజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన తనయుడు హితేష్ కూడా వైసీపీకి రాజీనామా చేసినట్టు సమాచారం.