మహా నగరం నిర్మాణం తప్పుకాదు.. కానీ..

మహా నగరం నిర్మాణం తప్పుకాదు.. కానీ..

రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నానని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. 2014కు ముందు నుంచే రాజకీయాలను దూరంగా ఉన్నానన్నారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ తన భార్య పురందేశ్వరి బీజేపీలో ఉన్నా.. తాను ఏ పార్టీలోనూ లేనని చెప్పారు. ఇప్పటి ఎన్నికల్లో రూ.20 నుంచి రూ.25 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని, ఓట్లు కొనే సంస్కృతికి తాను వ్యతిరేకమని దగ్గుబాటి అన్నారు. అమరావతి మహా నగరం నిర్మాణం తప్పుకానప్పటికీ పర్యావరణం, వికేంద్రీకరణ అంశాలు చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోడీ వ్యక్తిగత స్వార్థం లేని వ్యక్తి అని, ప్రతిపక్ష నేత జగన్‌ బాగానే పనిచేస్తున్నాడని అభిప్రాయపడ్డారు. పాదయాత్రతో వైసీపీ నిలదొక్కుకున్నదని, టీడీపీని సైతం ఆలోచనలో పడేసిందని అన్నారు.