దగ్గుపాటి మల్టీ స్టారర్ డైరెక్టర్ అతడేనా..

దగ్గుపాటి మల్టీ స్టారర్ డైరెక్టర్ అతడేనా..

దగ్గుపాటి వారసులతో మల్టీస్టారర్ చూడాలని అభిమానులు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. అదే విధంగా వారు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు మూవీ మోఘల్ డీ రామానాయుడు హయాం నుంచే జరుగుతున్నాయి. వెంకటేష్- రానా, వెంకటేష్-నాగచైతన్య కాంబో సినిమాలు చేయాలని ఆశపడ్డారు. కానీ సరైన కథలు దొరక్క చేయలేదు. ఆయన మరణాంతరం అతడి తనయుడు డీ సురేష్ బాబు ఈ కాంబోలలో ఒకదాదాని చేశారు. వెంకటేష్-నాగచైతన్య కాంబోలో ‘వెంకీమామ’ అంటూ సూపర్ హిట్ అందుకున్నారు. ఇక తరువాత మిగిలిన వెంకటేష్-రానా కాంబోను కూడా వెండితెరపైకి ఎక్కించాలన్న ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ కాంబో కోసం అభిమానులు కూడా చాలా కాలంగా ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాబాయ్, అబ్బాయిలు తమ కాంబో సినిమా చర్చల్లో ఉందని, ఓకే అయిన వెంటనే చేస్తామని చెప్పారు. ఈ సినిమాకు ఎట్టకేలకు ఓ దర్శకుడు దొరికాడని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. శతమానంభవతి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న  ఈ మల్టీస్టారర్‌ను చిత్రీకరించనున్నాడట. ఆయన ప్రస్తుం కొతి కొమ్మచ్చి అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల వెగేశ్న సురేష్ బాబుకి ఓ కథ వినిపించాడట. ఈ కథ నచ్చడంతో సురేష్ బాబు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాదే ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో బాబాయ్ అబ్బాయి పూర్తి మల్టీస్టారర్‌ను త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి.