ఆగస్టు 19, 2020 బుధవారం దినఫలాలు

ఆగస్టు 19, 2020 బుధవారం దినఫలాలు

మేషం: బంధువులతో సఖ్యత. విందువినోదాలు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగులకు కొన్ని చికాకులు తొలగుతాయి.
పరిహారం:  మందారం పుష్పాలతో కర్తికేయున్ని పూజించండి.
వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకోని విధంగా పదోన్నతులు.
పరిహారం: ఇంట్లో లక్ష్మీ పూజ నిర్వహించండి.
మిథునం: కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు కొంత శ్రమ తప్పదు.
పరిహారం : శివ పంచాక్షరీ జపం చేయండి.
కర్కాటకం:  ప్రయాణాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధువర్గంతో  తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
పరిహారం: తుమ్మిపూలతో శివ పూజ చేయండి.
సింహం: బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
పరిహారం:  విశ్వనాథ అష్టకం పారాయణ చేయండి.
కన్య: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.
పరిహారం: రావి చెట్టుకు నీరుపోసి 21 ప్రదక్షిణలు చేయండి.
తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. సోదరుల నుంచి సహాయం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
పరిహారం: తామర పుష్పాలతో ధనలక్ష్మి పూజ జరపండి.
వృశ్చికం: అనుకోని ప్రయాణాలు. బం«ధువులు, మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు.
పరిహారం: గో సేవ చేయండి.
ధనుస్సు: బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వాహన, గృహయోగాలు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
పరిహారం: గణపతికి బెల్లము, అరటి పండ్లు, శనగలు నివేదన చేయండి.
మకరం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఉద్యోగయత్నాలలో అనుకూలత. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
పరిహారం: చెరుకు రసం తో శివాభిషేకం చేయండి.
కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. మానసిక అశాంతి. అనారోగ్యం. పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో  మార్పులు ఉండవచ్చు.
పరిహారం: ఎర్రచందనం పొడితో శివాభిషేకం చేయండి.
మీనం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
పరిహారం: విష్ణు పంజరీ స్తోత్రం చదివి వడపప్పు పానకం నివేదన చేయండి.