సెప్టెంబర్ 1, 2020 మంగళవారం దినఫలాలు 

సెప్టెంబర్ 1, 2020 మంగళవారం దినఫలాలు 

మేషం : పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. ఉద్యోగయోగం. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం.
పరిహారం : నీటిలో కాస్తా పసుపు వేసుకుని స్నానం చేయండి.  

వృషభం : ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. రాజకీయవేత్తలకు చికాకులు.
పరిహారం : కమలా పండును ఇష్ట దైవానికి నివేదన చేయండి. 

మిథునం : పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కళాకారులకు కొంత గందరగోళం.
పరిహారం : పుల్లని అటుకులు దానం చేయండి. 

కర్కాటకం : అప్పుల బాధలు ఇబ్బందికి గురిచేస్తాయి. శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.
పరిహారం : అరటిపండు గుజ్జుని ఇష్టదైవానికి నివేదన చేయండి. 

సింహం : కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.
పరిహారం : పేదవారికి పాలు, పండ్లు దానం చేయండి. 

కన్య : కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. పనుల్లో అవరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ప్రయాణాలు వాయిదా. కళాకారులకు ఒత్తిడులు
పరిహారం : సుబ్రమణ్య స్వామికి పొంగలి నివేదన చేయండి.  

తుల : వ్యయప్రయాసలు. దుబారా ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. బంధువర్గంతో విభేదాలు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
పరిహారం : ఇంటికి వచ్చిన ముత్తైదువలకు కొద్దిగా పానకం ఇవ్వండి.   

వృశ్చికం : కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. రాజకీయవేత్తల యత్నాలు సఫలం.
పరిహారం : సత్యనారాయణ స్వామీవారికి పెసరపప్పు పొంగలి నివేదన చేయండి. 

ధనుస్సు : ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు కొంత నిరాశ.
పరిహారం : పార్వతీ అమ్మవారి అభిషేక తీర్థం ను తీసుకోండి. 

మకరం : వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆలయ దర్శనాలు. విద్యార్థులకు కొత్త ఆశలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
పరిహారం : సూర్యనారాయణ స్వామీ వారిని తులసి తో అర్చన చేయండి. 

కుంభం : ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఎంతగా కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు ఒత్తిడులు. కళాకారులు, పారిశ్రామికవేత్తల యత్నాలు ముందుకు సాగవు.
పరిహారం : దవనం తో దుర్గా దేవిని పూజించండి. 

మీనం : కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. కళాకారులకు నూతనోత్సాహం.
పరిహారం: మరువక పత్రం తో గణపతిని పూజించండి.