ఆగస్టు 23, 2020 ఆదివారం దినఫలాలు 

ఆగస్టు 23, 2020 ఆదివారం దినఫలాలు 

మేషం: కుటుంబ సౌఖ్యం. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.  శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మిథునం: అనుకున్న పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం.

కర్కాటకం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

సింహం: దూరపు బంధువుల నుంచి ధనలబ్ధి. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. చిన్ననాటి  మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త  హోదాలు.

కన్య: నిరుద్యోగులకు శుభవార్తలు. సమస్యలు కొన్ని తీరి ఊరట చెందుతారు. పనులలో విజయం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు ఒత్తిళ్ల నుంచి గట్టెక్కుతారు.

తుల: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: కొన్ని పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు ఒత్తిడులు.

ధనుస్సు: ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. విందువినోదాలు.

మకరం: పనులలో ఆటంకాలు. శ్రమాధిక్యం. కొద్దిపాటి  అనారోగ్యం. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కుంభం: విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

మీనం: వ్యయప్రయాసలు. కుటుంబంలో ఒత్తిడులు. అనుకున్న పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో వివాదాలు.