ఆగస్టు 26, 2020 బుధవారం దినఫలాలు

ఆగస్టు 26, 2020 బుధవారం దినఫలాలు

మేషం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. వస్తు, వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొంత ఊరట.

వృషభం: సన్నిహితులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు.

మిథునం: వ్యవహారాలలో పురోగతి. ఆస్తుల వివాదాలు పరిష్కారం. శుభకార్యాలపై చర్చలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు.

సింహం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత.

కన్య: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. ఆస్తులు కొంటారు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం: పరపతి పెరుగుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

ధనుస్సు: ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: సోదరులతో వివాదాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

మీనం: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరటనిస్తుంది. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవచింతన.