మార్చి 29, 2020 ఆదివారం దినఫలాలు

మార్చి 29, 2020 ఆదివారం దినఫలాలు

మేషం
మొదలుపెట్టే పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు . ఇష్టులతో   గడుపుతారు .   కీలకమైన  వ్యవహారాలు దైవబలంతో పూర్తవుతాయి .  చంచల బుద్ధివల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి . దుర్గారాధన  శుభప్రదం

వృషభం

వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.   ప్రణాళికాబద్దంగా వెళ్లకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి .   కొన్ని సమయాల్లో అస్థిరబుద్దితో వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి .  నవగ్రహ ధ్యానం శుభప్రదం.

మిథునం
మిశ్రమకాలం .   ఇబ్బందిపెడుతున్న  సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.  శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి . దుర్గాదేవిని ఆరాధించాలి.

కర్కాటకం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. మిమి రంగాల్లో జాగ్రత్తగా మెలగాలి . అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సూర్య ఆరాధన చేస్తే  మంచిది.
సింహం
 ప్రయత్నాలు ఫలిస్తాయి . మానసికంగా ద్రుడంగా ఉంటారు.   బుద్దిబలం బాగుండటం వలన కొన్ని కీలక వ్యవహారములలోనుంచి బయటపడగలుగుతారు. శివ నామస్మరణా శుభప్రదం.

కన్య
  ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది.  ఇస్టులతో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూలఫలితాలున్నాయి. చిత్తసౌఖ్యం ఉంది.  ఇష్టదైవం స్తుతి శుభప్రదం.

తుల
భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  మొదలుపెట్టిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు.  మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.  సాయి బాబా సచ్చరిత్ర  పఠిస్తే బాగుంటుంది.

వృశ్చికం

 ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు .  కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి.  ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది .  సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే   శుభ ఫలితములు కలుగుతాయి.
ధనుస్సు
ఏ నిర్ణయం తీసుకున్నా బంధుమిత్రులను సంప్రదించకుండా తీసుకోవద్దు.  తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు  తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి .  ధనవ్యయం సూచితం.    నవగ్రహ ధ్యానశ్లోకాలు చదవండి.

మకరం
 ఒక శుభవార్త వింటారు.  మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.  అధికారుల సహకారం ఉంటుంది. ఆర్ధిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం.  గణపతి అష్టోత్తరము పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

కుంభం
విందు వినోద కార్యక్రమములలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలఫలితాలున్నాయి.   ఒక వ్యవహారములో ధనము చేతికి అందుతుంది.  విష్ణు సహస్రనామం చదివితే ఇంకా బాగుంటుంది.

 మీనం
శుభ  కార్యక్రమములలో పాల్గొంటారు.  ఒక వ్యవహారములో ధనము చేతికి అందుతుంది.  చేపట్టే పనిలో విఘ్నం కలుగకుండా చూసుకోవాలి . భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేస్తారు .     తోటివారిని కలుపుకు పోవాలి .  లక్ష్మి ధ్యానం శుభప్రదం .