ఆగష్టు 3, 2020 సోమవారం దినఫలాలు

ఆగష్టు 3, 2020 సోమవారం దినఫలాలు

మేషం: పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. రావి చెట్టుకు నీరును పోయండి. 

వృషభం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధనలబ్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. చిన్నపిల్లకు స్వీట్లు పంచండి. 

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. నూవు ఉండలు దానం చేయండి.  

కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. వెంకటేశ్వర స్వామి ఆలయం లో సేవ చేయండి. 

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. పేద విద్యార్ధుల చదువు ఆర్ధిక సహాయం చేయండి. 

కన్య: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. లక్ష్మీ నారసింహ స్వామీ దర్శనం చేయండి. 

తుల: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అష్టలక్ష్మీ స్తోత్రం పారాయణం చేయాలి. 

వృశ్చికం: శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత. విష్ణు పూజ, తులసీ అర్చన చేయాలి.

ధనుస్సు: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. 

మకరం:  వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. రామ రక్షా  స్తోత్రం పఠించండి

కుంభం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి. గణపతి ఆలయం లో సేవ చేయండి. 

మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త నిర్ణయాలు. సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు. ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం పారాయణం చేయాలి.