రాశిఫలాలు: 16 మార్చి 2019 శనివారం

రాశిఫలాలు: 16 మార్చి 2019 శనివారం

మేషం
ఇవాళ ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. 

వృషభం
మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం, దాంతో వారి కోపానికి గురవటం జరగొచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం కూడదు. 

మిథునం
ఇతరులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది.

కర్కాటకం
మీరు స్నేహితులతో ఇవాళ ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం.

సింహం
ఆర్థికంగా ఇవాళ సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ, ప్రయాణాలు కానీ చేయవలసి ఉంటుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. 

కన్య
ఇవాళ ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు.

తుల
వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. 

వృశ్చికం
ఇవాళ దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. విదేశీయానానికి సంబంధించి ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు తప్పేలాలేవు. 

ధనుస్సు
ఇవాళ మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి.

మకరం
ఇవాళ వ్యాపార లావాదేవీలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. వివాహ విషయంలో అనుకూలమైన ఫలితం వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. 

కుంభం
వృత్తి విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నరాలు, మెడకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడే అవకాశముంది. 

మీనం
మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంటుంది. దీంతో మానసికంగా ఆందోళనకు లోనవుతారు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి.