రాశి ఫలాలు: సోమవారం 28 జనవరి 2019

రాశి ఫలాలు: సోమవారం 28 జనవరి 2019

మేషం:
జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ప్రయాణం, దేవాలయ సందర్శన చేస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి. వివాహ విషయంలో శుభవార్త  వింటారు. ప్రయాణ సూచన ఉంది.
వృషభం:
 చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు అనుకూల ఫలితం పొందుతారు.  ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
మిథునం:
డబ్బు విషయంలో సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించకపోవడం, పెట్టుబడుల కారణంగా నష్టపోవడం జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార  లావాదేవీలకు అనువైన దినం కాదు. సంతానం ఆరోగ్యం కారణంగా కొంత ఆందోళనకు లోనవుతారు. కీలక విషయాల్లో జాగ్రత్త అవసరం.
కర్కాటకం:
ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం ఆందోళనకు కారణమవుతుంది. భూసంబంధ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. కీలక విషయాల్లో పెద్దల  సలహాలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
సింహం:
ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన బకాయిలు వస్తాయి. తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకొని డబ్బు, చేపట్టిన పనిలో విజయం వరిస్తుంది. ఉద్యోగ విషయంలో  శుభవార్త వింటారు.
కన్య:
చేపట్టిన పనులు వాయిదా పడటం, అనుకోని అడ్డంకులు జరగవచ్చు. పట్టువదలక ప్రయత్నిస్తే విజయం సొంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే  అవకాశముంటుంది. 
తుల:
దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. విందువినోదాల్లో  పాల్గొంటారు. మాట విషయంలో జాగ్రత్త అవసరం.
వృశ్చికం:
ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీలవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి. కీలక  విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోండి.
ధనుస్సు:
ఆనందంగా, లాభదాయకంగా ఉంటుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ప్రయాణ  సూచన ఉంది. 
మకరం:
వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పెద్దల  నిర్ణయాలు పనికివస్తాయి.
కుంభం:
ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే  అవకాశముంటుంది. విందువినోదాల్లో పాల్గొంటారు.
మీనం:
మీ సహోద్యోగులతో, పైఅధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించడం మంచిది. ప్రయాణంలో అనవసరమై చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది. అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం.  పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు. కీలక విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోండి.