రాశి ఫలాలు: 17 జనవరి 2019 గురువారం

రాశి ఫలాలు: 17 జనవరి 2019 గురువారం

మేషం:
ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ఉన్నాయి. విలువైన వస్తువులు, నగల విషయంలో జాగ్రత్త అవసరం. ఏ విషయంలోనైనా అజాగ్రత్తగా ఉండకండి. ప్రయాణాల్లో మరింత  జాగ్రత్త.
వృషభం:
ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి.  విందువినోదాల్లో పాల్గొంటారు.
మిథునం:
ఉద్యోగ, వ్యాపారంలో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అనుకున్న మార్పు కానీ ఉంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల  దినం. పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.
కర్కాటకం:
మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. కీలక  విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పనికివస్తాయి.
సింహం:
మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.  ప్రయాణాల్లో జాగ్రత్త.
కన్య:
స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. విందువినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. వాహనం కొనుగోలు, భూసంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.
తుల:
గృహసంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు, వాహనం కొనుగోలు చేయటం చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరులతో వ్యవహరించేటపుడు  జాగ్రత్త. అనవసర విషయాల్లో తలదూర్చకండి.
వృశ్చికం:
ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం జరుగుతుంది. సమయానికి సాయం కూడా అందదు. మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. శాంతి  కోసం పిల్లలతో గడపటం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం చేయండి.
ధనుస్సు:
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది. దూర ప్రయాణాలు  చేయకండి.
మకరం:
అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురవుతారు. జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
కుంభం:
ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మాట తీరు కారణంగా వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. మానసికంగా దృఢంగా ఉండటం  మంచిది. కీలక విషయాల్లో పెద్దల నిర్ణయం తీసుకోవడం మంచిది.
మీనం:
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మనస్పర్థలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో అనుకూల వాతావరణం ఉంది.  ప్రయాణ సూచన ఉంది.