రాశి ఫలాలు: మంగ‌ళ‌వారం 22 జనవరి 2019

రాశి ఫలాలు: మంగ‌ళ‌వారం 22 జనవరి 2019

మేషం: 
ఆరోగ్యం సామాన్యంగాఉంటుంది. కుటుంబసభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త‌ అవసరం. పెట్టుబడులకు అనువైన  రోజు కాదు. ప్రయాణాల్లో జాగ్రత్త.
వృషభం: 
ఆర్థికంగా అనుకూల దినం. రావలసిన బకాయిలు వస్తాయి. అలాగే మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు, విజయం వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త  వింటారు. దూర ప్రయాణ సూచన ఉంది. 
మిథునం: 
 చేపట్టినపనులు వాయిదాపడటం, అనుకోని అడ్డంకులు రావటం జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది.  వివాదాలకు దూరంగా ఉండండి. 
కర్కాటకం:
దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను  కలుసుకుంటారు. విందులో పాల్గొంటారు. 
సింహం: 
ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మానసికంగా ఏదోతెలియని ఒత్తిడిని ఫీల్‌ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు విషయంలో జాగ్రత్త. ప్రయాణ సూచన ఉంది.
కన్య: 
ఆనందంగా, లాభదాయకంగా ఉంటుంది. మిత్రులతో ఆనందంగా గడపటం చేస్తారు. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది.  ప్రయాణం చేసే అవకాశం ఉంది. 
తుల:
వృత్తిపరంగా అనుకూలంగాఉంటుంది. కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి  శుభవార్త వింటారు.
వృశ్చికం: 
ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదోతెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి అధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసే అవకాశముంది.
ధనుస్సు: 
సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించటం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో జాగ్రత్త. పెట్టుబడులకు,  భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.
మకరం: 
వైవాహిక జీవితంలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నతి కాని, అనుకూల మార్పుకాని ఉంది. వ్యాపార  వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థికస్థితి మెరుగవుతుంది.
కుంభం: 
వృత్తి విషయంలోఅనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. పదోన్నతి, నూతన ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. చేపట్టిన పనులు  విజయవంతంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల సహకారం అందుకుంటారు. చేసిన పనులకు గుర్తింపు లభిస్తుంది.
మీనం: 
ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. మీ ఆలోచనలు, సృజనాత్మతకతకు గుర్తిపు లభిస్తుంది. సంతానంకు సంబంధించి ముఖ్యమైన పనులు పూర్తిచేయగలుగుతారు. ప్రయాణ సూచన ఉంది.  విందువినోదాల్లో పాల్గొంటారు.