కోహ్లీసేనకు షాక్‌.. 

కోహ్లీసేనకు షాక్‌.. 

ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళ్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు షాక్‌ తగిలింది. స్పీడ్‌స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. భుజానికి గాయం కారణంగా తాను తప్పుకుంటున్నట్టు స్టెయిన్‌ ప్రకటించాడు. టోర్నీ ప్రారంభంనాటికి ఆర్‌సీబీ జట్టులో స్టెయిన్‌ లేడు. నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ గాయపడడంతో అతని స్థానంలో స్టెయిన్‌ను ఆర్‌సీబీ తీసుకుంది. జట్టులో చేరాక 3 మ్యాచ్‌లు ఆడిన డేల్‌.. విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ప్రతి మ్యాచూ విజయం సాధించాల్సిన తరుణంలో స్టెయిన్‌ దూరమడం ఆర్‌సీబీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి.