దళిత, గిరిజన సింహ గర్జన నేడే 

దళిత, గిరిజన సింహ గర్జన నేడే 

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని దళిత వర్గాలు ఇవాళ వరంగల్‌లో దళిత, గిరిజన సింహగర్జన మహాసభ నిర్వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కాలని చూస్తున్నారని, తాము నిర్వహించే సింహగర్జన కేంద్రానికి ఒక హెచ్చరిక కావాలని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు.  జాతీయ స్థాయి దళిత నేతలను ఈ వేదికపైకి తీసుకొస్తామని మందకృష్ణ వెల్లడించారు.  దేశంలో దళితులను పాలకులు బానిసలుగా చూస్తున్నారని, దేశంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని మందకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని తొలగించేందుకు ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోందని అందుకు నిరసనగా ఆదివారం పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నామని ఆయన వివరించారు. తాము హక్కుల కోసం పోరాడతామని ఓట్లతో బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా మందకృష్ణ హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున దళిత, గిరిజన సంఘాలు ఈ సభను విచ్చేసి విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపు నిచ్చారు.