దళిత యువకుడి దారుణ హత్య.. ఎందుకే తెలిస్తే షాకే..!

దళిత యువకుడి దారుణ హత్య.. ఎందుకే తెలిస్తే షాకే..!

ఓ దళిత యువకుడి హత్య కలకలం సృష్టిస్తోంది... వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని దక్షిణ చెన్నై.. విల్లుపురంలో 24 ఏళ్ల దళిత యువకుడు పెట్రోల్‌ బంక్‌లు పనిచేస్తున్నాడు.. డ్యూటీకి వెళ్లే సమయంలో ఆ పక్కనే ఉన్న పొలంలో మల విసర్జన చేసేందుకు వెళ్లాడు ఆ యువకుడు.. అయితే, అది గమనించిన ఓ మహిళ కేకలు వేయడం ప్రారంభించింది.. అరుపులు విన్న బాధితుడు... మలవిసర్జన చేయడానికి బహిరంగ మైదానంలో ఆగిపోయాడు.. ఆ యువకుడు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అక్కడికి వచ్చిన ఇతరులకు ఆ మహిళ చెప్పింది.. దీంతో.. అక్కడికి వచ్చిన గుంపు అతడిని వెంబడించింది.. పారిపోయేందుకు ప్రయత్నించినా ఉపయోగంలేకుండాపోయింది.. ఆ యువకుడిని పట్టుకుని దారుణంగా కొట్టారు.. కాళ్లు చేతులు, కట్టి హిసించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు.. బాధిత యువకుడు శక్తివేల్‌ను ఆస్పత్రికి తరలించారు.. అయితే, తీవ్రగాయాలపాలైన ఆ యువకుడు కొన్ని గంటల్లోనే మృతిచెందినట్టు బాధితుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు మహిళలు సహా 11 మందిని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 147, 148, 294 (బి), 302 కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ / ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.