'టీఆర్‌ఎస్‌కు థ్రెట్‌.. అందుకే ఆ 12 మంది..'

'టీఆర్‌ఎస్‌కు థ్రెట్‌.. అందుకే ఆ 12 మంది..'

అధిష్టానం ఇస్తే పీసీసీ అధ్యక్ష పదవిని తీసుకుంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. 'అధిష్టానం ఇస్తే పీసీసీ ఎందుకు తీసుకోను?  సత్తా లేదా.. సమర్థుడిని కాదా..?' అని ప్రశ్నించారు. పీసీసీ బాధ్యతలు ఎవరికిచ్చినా.. ఏపీ సీఎం జగన్‌ను చూసి నేర్చుకోవాలని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ  తెలంగాణలో పార్టీ బాగుపడాలంటే అధిష్టానం ఆలోచనా విధానం మారాలన్నారు.

ప్రజల్లో ఉండి ప్రజా ఉద్యమాలు చేయకనే విఫలమవుతున్నామని అభిప్రాయపడ్డారు. ప్రజలకు, నాయకత్వానికి మధ్య గ్యాప్ ఉందన్న ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాజెక్టులకు, కాంగ్రెస్ నాయకులకు సంబంధాలు లేవా..? అని ప్రశ్నించారు. అటువంటప్పుడు అధికార పార్టీతో కాంగ్రెస్‌ నేతలు ఎలా కొట్లాడతారని ప్రశ్నించారు. పదేళ్లుగా టీఆర్‌ఎస్‌ను ఫ్రెండ్లీ పార్టీ అని అనుకున్నామని.. అందుకే విఫలమయ్యామని దామోదర అన్నారు.

ఇక.. టీఆర్‌ఎస్‌కు నిలకడ లేదని.. అందుకే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తీసుకుంటాన్నారని అభిప్రాయపడ్డారు. 'ఎంత పెద్ద థ్రెట్‌ లేకపోతే.. 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటారు..?' అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డికి హోంమంత్రి ఇవ్వడమంటేనే టీఆర్‌ఎస్‌కు ఇండికేషన్‌ ఇవ్వడమని అన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి కేసీఆర్‌ వెళ్లకపోవడంతో బీజేపీకి తనకు గ్యాప్‌ ఉందని కేసీఆర్‌ సంకేతాలు పంపించారని అన్నారు.