ఇంగ్లాండ్ జట్టు నుండి మరో ఆటగాడు ఔట్...

ఇంగ్లాండ్ జట్టు నుండి మరో ఆటగాడు ఔట్...

పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టులో ఒకడైన డాన్ లారెన్స్, తన కుటుంబ సభ్యులలో ఒకరు మరణించడంతో ఆ ఆటగాడు బయో- సెక్యూర్ బబుల్ నుండి బయటకు వెళ్తున్నట్లు ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ ‌బోర్డు తెలిపింది. 23 ఏళ్ల ఈ ఆటగాడికి ఇదే మొదటి అంతర్జాతీయ సిరీస్. ఇప్పటివరకు 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన లారెన్స్ 3,804 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అయితే పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఆడుతున్న తన మొదటి టెస్ట్ సిరీస్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో రిజర్వ్ ఆటగాడిగానే ఉన్నాడు. ఇక ఈ ఆటగాడి కంటే ముందు ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా కొన్ని కుటుంబ కారణాల వల్ల టెస్ట్ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరం అయ్యాడు. అయితే జరిగిన  మొదటి మ్యాచ్ ను మూడు వికెట్ల తేడాతో గెలిచి ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యం సాధించింది. ఇక రెండవ టెస్ట్ సౌతాంప్టన్‌లోని అగాస్ బౌల్‌లో ఈ గురువారం ప్రారంభం కానుంది.