హైదరాబాద్‌ ప్రజలకు దానకిషోర్‌ కీలక సూచన

హైదరాబాద్‌ ప్రజలకు దానకిషోర్‌ కీలక సూచన

వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్‌ఎంపీ కమిషనర్‌ దానకిషోర్‌ కీలక సూచన చేశారు. హైదరాబాద్‌లో వర్షాలు కురిసేటప్పుడు ప్రజలెవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని కోరారు. వర్షం పడేటప్పటికే రోడ్లపై చాలా మంది ఉంటారని.. వారిందరికీ తమ గమ్యస్థానాలకు వెళ్లే అవకావం ఇవ్వాలన్నారు. గంటకు 2 సెంటీమీటర్ల వర్షపాతం తట్టుకునే డ్రైనేజీ వ్యవస్థ మాత్రమే నగరంలో ఉన్నదని.. అంతకంటే ఎక్కువ వర్షం పడితే ఇబ్బందేనని అన్నారు. ఇక.. విపత్తులను ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధంగా ఉందన్నారు.