ఖైరతాబాద్ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తాం

ఖైరతాబాద్ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తాం

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ నాయకుడు దానం నాగేందర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఖైరతాబాద్ టికెట్ ఎవరికి ఇచ్చినా కలసి పనిచేస్తామని తేల్చి చెప్పారు. తాను ఏ పదవి ఆశించి టీఆర్‌ఎస్ పార్టీలో చేరలేదని, పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రం ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ చేపట్టారన్నారు. అభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని గుర్తు చేశారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలను టీఆర్‌ఎస్ వైపు ఆకర్షిస్తున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడా లేని విధంగా కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు.