కారెక్కిన దానం

కారెక్కిన దానం

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, సీనియర్‌ నేత దానం నాగేందర్‌ ఇవాళ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖరరావు ఆధ్వరంలో ఆ పార్టీలో చేరారు. నాగేందర్‌కు కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్‌ ఆహ్వానించారు. delతోపాటు పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో నాగేందర్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. తమ పార్టీలో ఎవరు పనిచేయడానికి వచ్చినా సంతోషమేనని చెప్పారు. అంతా కలిసి పనిచేయాలన్నదే తమ సిద్ధాంతమని కేసీఆర్‌ వివరించారు.