గోషామహల్‌ కాదు ఖైరతాబాదే...?

గోషామహల్‌ కాదు ఖైరతాబాదే...?

కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌... గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగినా... చివరకు ఆయనను ఖైరతాబాద్‌ నుంచే పోటీకి నిలపాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి దానం నాగేందర్ పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టేనని... నియోజకవర్గంలో పని చేసుకోవాల్సిందిగా ఆయనకు సూచించినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీని రద్దు చేసి 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్... మరో 14 స్థానాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు... అందులో ఖైరతాబాద్‌ కూడా ఒకటి... దీంతో దానంను బరిలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ఖైరతాబాద్‌ నుంచి మాజీ మంత్రి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా ఖైరతాబాద్‌ నుంచి పోటీచేయడానికి ఆసక్తి చూపుతున్నారు... ఈ విషయంపై ఇప్పటికే ఆమె కేటీఆర్‌ను కూడా కలిసినట్టు తెలుస్తోంది. మరి దానం నాగేందర్‌కు ఖైరతాబాద్ సీటు ఇస్తే... ఆమెను ఎక్కడి నుంచి పోటీకి పెడతారన్నది కూడా ఆసక్తిగా మారింది.