తిరిగి కాంగ్రెస్‌ గూటికి దానం నాగేందర్‌?

తిరిగి కాంగ్రెస్‌ గూటికి దానం నాగేందర్‌?

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన మాజీ మంత్రి దానం నాగేందర్... తిరిగి సొంత గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మధ్యే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో భారీ సంఖ్యలో కదిలివచ్చిన అనుచరులతో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్... మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశమైన దానం... కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా, టీఆర్ఎస్ తాజాగా కొంగరకలాన్‌ను నిర్వహించిన ప్రగతి నివేదన సభకు సిటీ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తల తరలింపునకు కృషి చేసిన దానం... రాహుల్ గాంధీ... తెలంగాణ పర్యటనపై కూడా సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.