రామ మందిర దర్శనానికి వస్తా : పాక్ క్రికెటర్

రామ మందిర దర్శనానికి వస్తా : పాక్ క్రికెటర్

అయోధ్య రామ మందిర నిర్మాణానికి జరిగిన భూమి పూజ పై అప్పుడు స్పందించిన పాకిస్థాన్ క్రికెటర్ డ్యానిష్ కనేరియా ఇప్పుడు రామ మందిరానికి సంబంధించి మరికొన్ని వ్యాఖ్యలు చేసాడు. భూమి పూజ సమయంలో అయోధ్యలో ఇది ఒక ఆశీర్వాద దినం. ఈ రోజు ప్రతి భారతీయుడి జ్ఞాపకార్థంగా ఉంటుంది. రాముడి అందం అతని పేరు లో కాకుండా అతని పాత్రలో ఉంది. అతను చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం అని చెప్పాడు. అయితే రామ మందిర‌ భూమి పూజపై అతను స్పందించడంతో కొంతమంది అతనిపై విమర్శలు గుప్పించారు.. దాంతో.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా మాట్లాడుతూ... హిందువుగా రాముడిని నేను ఆరాధిస్తాను. చిన్నప్పటి నుంచే ఆ దేవుడు అంటే నాకు ఇష్టం. ఆయన జీవనవిధానం నాకు ఆదర్శం. అయితే రామ మందిరం పై నేను చేసిన ట్వీట్ ఎవరి మనోభావాల్ని దెబ్బ తీయాలని కాదు. ఒకవేళ రాముడు కనికరిస్తే.. అయోధ్య రామ మందిరాన్ని చూసేందుకు తప్పకుండా భారత్ కు వెళ్తాను’’ అని కనేరియా తెలిపాడు. అయితే ఇప్పటివరకు పాక్  తరపున క్రికెట్  ఆడిన హిందువులు కేవలం ఇద్దరు మాత్రమే. అందులో డానిష్ కనేరియా ఒకడు. ప్రస్తుతం ఈ ఆటగాడు  జీవితకాల నిషేధాన్ని ఎదుర్కుంటున్నాడు.