మొత్తానికి డార్లింగ్ పూర్తిచేశాడు...

మొత్తానికి డార్లింగ్ పూర్తిచేశాడు...

డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి నటుడిగా మారిపోయిన సంగతి తెలిసిందే.  బాహుబలితో వచ్చిన ఇమేజ్ ను నిలుపుకోవడానికి ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు.  సాహో సినిమా ద్వారా తన స్టార్ డమ్ ను నిరూపించుకోవాలని అనుకుంటున్న ప్రభాస్, గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు.  ఈ రోజుతో సాహో లో తన పార్ట్ పూర్తయింది.  మిగతా షూటింగ్ త్వరలోనే పూర్తి చేయనున్నారు.  

షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేస్తారట.  యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఆగస్టు 15 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.