‘రాధేశ్యామ్‌’ టీమ్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన‌ ప్రభాస్‌

‘రాధేశ్యామ్‌’ టీమ్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన‌ ప్రభాస్‌

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'రాధేశ్యామ్‌' సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను చకచకా పూర్తి చేస్తున్న యూనిట్‌ కోసం ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడని తెలుస్తోంది. 'రాధేశ్యామ్‌' సినిమా కోసం పని చేస్తున్న వారందరికీ చేతి వాచ్‌లు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వాచ్‌లకు సంబంధించిన ఫొటోలను ప్రభాస్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరిలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే,‌ ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రభాస్.. దాని తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సలార్’ సినిమా లైన్లో ఉంది. ఈరోజు 'సలార్'‌ షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రంతో పాటే ‘ఆదిపురుష్’ కూడా చేయనున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్.