సుప్రీం కోర్టు ఆదేశాలను కేసీఆర్ పాటించాలి

సుప్రీం కోర్టు ఆదేశాలను కేసీఆర్ పాటించాలి

ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ కొనసాగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ముఖ్యమంత్రికి విజ్ఙప్తి చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చౌక్ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ బాధను చెప్పుకోవడానికి అవకాశమివ్వాలని వీహెచ్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎం కేసీఆర్‌ గౌరవించాలని ఆయన సూచించారు. క్రిమిలేయర్‌తో బీసీలకు అన్యాయం జరుగుతుందని, అందుచేత క్రిమిలేయర్‌ను ఎత్తేయాలని హనుమంతరావు కోరారు.