నేటితో ముగియనున్న దసరా ఉత్సవాలు..
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనక దుర్గమ్మ రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు. వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంతో అభయ ముద్రతో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారిని కనులారా వీక్షించి తరిస్తున్నారు భక్తులు. సాయంత్రం అమ్మవారిని హంస వాహనంపై ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు అర్చక స్వాములు.
ఈ రోజున నిర్వహించే తెప్పోత్సవ సేవకు అంతరాయం కలిగింది. కృష్ణానదికి వరద పోటెత్తుతున్నందున గంగా సమేత దుర్గామల్లేశ్వరుల ఉత్సవమూర్తులను హంస వాహనంపై ముమ్మారు నదీ విహారం చేయించే ప్రక్రియను రద్దు చేశారు. దుర్గాఘాట్ వద్ద నదిలోనే హంస వాహనాన్ని ఉంచి పూజలు నిర్వహిస్తారని కలెక్టర్ ఇంతియాజ్, సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. ఇక హంస వాహనంలోకి 8 మంది వేదపండితులు, ఇద్దరు అర్చకులు, ఇద్దరు కర్రపు స్వాములు, ఇద్దరు కాగడాలు పట్టేవారు, ఆరుగురు భజంత్రీలవారు, ఒక ఎస్ఐను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)