వైసీపీ గూటికి దాసరి కుమారుడు

వైసీపీ గూటికి దాసరి కుమారుడు

దివంగత సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌ ఇవాళ వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో పార్టీ అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్‌ మాట్లాడుతూ వైసీపీ సిద్ధాంతాలు, జగన్‌ ఆశయాలు నచ్చి ఆ పార్టీలో చేరారని చెప్పారు. తన తండ్రి దాసరి నారాయణరావు ఉండుంటే వైసీపీ నుంచే పోటీ చేసే వారని అన్నారు. జగన్‌ ఆదేశిస్తే ప్రచారానికి వెళ్తానని చెప్పారు.