వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కృష్ణాజిల్లా విజయ డెయిరీ డైరెక్టర్‌ దాసరి వెంకట బాలవర్థన్‌ రావు ఇవాళ వైసీపీలో చేరారు. అధ్యక్షుడు వైఎస్ జగన్‌ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బాలవర్థన్‌ రావు వెంట సోదరుడు దాసరి జై రమేష్‌ ఉన్నారు. బాలవర్థన్‌ రావు చేరికతో గన్నవరంలో వైసీపీ బలం పెరుగుతుందని భావిస్తున్నారు.