డేటా చోరీ కేసు: తెలంగాణ పోలీసులపై కేసు!

డేటా చోరీ కేసు: తెలంగాణ పోలీసులపై కేసు!

ఏపీ, తెలంగాణ మధ్య వివాదంగా మారిన డేటా చోరీ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. డేటా చోరీ ఎపిసోడ్ పై సీరియస్ అయిన తెలుగుదేశం పార్టీ నేతలు... టీడీపీ డేటాను చోరీ చేశారంటూ తెలంగాణ పోలీసులపై కేసు పెట్టారు. ఈ వ్యవహారంపై గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది టీడీపీ బృందం. మంత్రులు కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎంపీ కనకమేడల, జీవీ ఆంజనేయులు, డొక్కా మాణిక్యవరప్రసాద్ వెళ్లి... గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.