డేటా చోరీ సిట్ ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించనున్న సుబ్రహ్మణ్యం

డేటా చోరీ సిట్ ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించనున్న సుబ్రహ్మణ్యం

డేటా చోరీ సిట్ ఇంచార్జిగా బాల సుబ్రహ్మణ్యం ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. తుళ్లూరులో ఇప్పటికే కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు దర్యాప్తులో భాగంగా రెండు మూడు రోజుల్లో తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్నాక సిట్ బృందంతో బాల సుబ్రహ్మణ్యం భేటీ కానున్నారు. మరోవైపు ఐటీ నిపుణులతో సిట్ బృందం సంప్రదింపులు చేయనుంది. ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆధారాలను టీడీపీ నేతలు పోలీసులకు అందజేసారు. టీడీపీ ఇచ్చిన ఆధారాలను సిట్ పరిశీలించనుంది.