సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు

సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల సంక్రాతి సెలవులలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 8 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉంది. కాగా ఈ సెలవులను జనవరి 12 నుంచి 20కి మారుస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం వలన సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేశారు. అయితే, ఈ మార్పును ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 8 నుంచి 17 వరకు సెలవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.