హైకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నా..

హైకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నా..

ధర్నాచౌక్ ఎత్తివేత పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక, నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్ ప్రభుత్వానికి ఈ తీర్పు చెంప పెట్టులాంటిదని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు, అనేక నిరసనలు, పోరాటాలకు నిలయమైన ధర్నాచౌక్ ని ఎత్తివేయవద్దని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినిపించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి ధర్నాచౌక్ విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు టీఆర్ఎస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిందన్నారు. నిరసనల గళం వినేందుకు సైతం ఆసక్తి చూపని ఈ ప్రభుత్వానికి హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల ద్వారా సరైన చురకలు అంటించిదని ఎద్దేవా చేశారు.