కారంపొడితో మామపై కోడలి దాడి

కారంపొడితో మామపై కోడలి దాడి

తిరుపతి అనంత వీధిలో దారుణం చోటుచేసుకుంది. మామ కళ్లలో కారం కొట్టిందో కోడలు. మంటకు తట్టుకోలేక ఏడుస్తున్న తండ్రిపై ఆ కొడుకు కూడా దాడికి పాల్పడ్డాడు. ఇందుకు ఆమె తమ్ముడు కూడా సహకరించాడు. దాడి అనంతరం స్ధానికులు బాధితుడిని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఆస్తి కోసం వృద్ధుడిపై ఎప్పటి నుంచో వేధింపులకు పాల్పడుతున్నా.. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియదు. బాధిత వృద్ధుడు ఒక్కసారిగా బయటకు రావడం.. వీధిలోనే అందరూ చూస్తుండగా మామపై కోడలు కారం చల్లడం.. తండ్రిపై కొడుకు దాడి చేయడం ఆ వీధిలోని వాళ్లను షాక్‌కు గురి చేసింది. ఆ వీధిలోని వాళ్లంతా ఆ వీడియోను వాట్సాప్‌లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఇంతకు ముందే ఎన్నోసార్లు తిరుపతి వెస్ట్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో షేర్ అవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.