తండ్రిని హతమార్చిన కుమార్తె

తండ్రిని హతమార్చిన కుమార్తె

క్షణికావేశంలో తండ్రిని హతమార్చింది ఓ కుమార్తె. వేరే మహిళతో సహజీవనం చేస్తూ.. తన తల్లిని మానసికంగా హింసిస్తున్నాడని తండ్రిపై కత్తితో దాడిచేసి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. విశాఖ కంచరపాలెంలో నివసిస్తున్న కోడ సముద్రయ్య రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్న ఓ మహిళతో సముద్రయ్య గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెను నేరుగా ఇంటికి  తీసుకురావడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. గురువారం అర్ధరాత్రి భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. తల్లిపై దాడి చేస్తున్న సముద్రయ్యను అడ్డుకోబోయిన కుమార్తె బిబాషాపై కూడా దాడికి యత్నించాడు. క్షణికావేశంలో బిబాషా ..ఇంట్లో ఉన్న చాకుతో తండ్రిని పొడిచింది. ఈ ఘటనలో సముద్రయ్య అక్కడకక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బిబాషా, ఆమె తల్లి నాగలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.