ఏలూరులో దారుణం: కన్నకూతురిపైనే అత్యాచారం...

ఏలూరులో దారుణం: కన్నకూతురిపైనే అత్యాచారం...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తో పాటుగా క్రైమ్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.  లాక్ డౌన్ సమయంలో క్రైమ్ కొద్దిగా తగ్గినట్టు కనిపించినా గృహహింస వంటివి పెరిగిపోతున్నాయి. తండ్రి అంటే కంటికి రెప్పలా కాపాడేవాడు అని అర్ధం.  కానీ కాపాడాల్సిన తండ్రే కీచకుడిగా మారితే ఆ దారుణాన్ని ఎవరికీ చెప్పుకోగలరు.  ఇలాంటి సంఘటన ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.  

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పెదవేగిలో నివసించే దంపతులకు 14 సంవత్సరాల బాలిక ఉన్నది.  ఆ బాలిక ఈనెల 16 వ తేదీన ఇంటి నుంచి పారిపోయింది.  అయితే ఓ అపరిచిత వ్యక్తి ఆమెను తీసుకెళ్లి ఏలూరులో ఒకరోజు ఉంచి తిరిగి ఆమె ఇంటి దగ్గర దిగబెట్టాడు.  అదే సమయంలో సదరు వ్యక్తి, ఆ బాలిక తండ్రి బాలికపై అనేకమార్లు అత్యాచారం చేశాడని చెప్పాడు.  దీంతో ఆ తల్లి ఆ బాలికను తీసుకొని వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.  ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి, నిందితుడు  పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయాడు.  వెంటనే అతనిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  అయితే, తనను సహాయం చేస్తానని చెప్పిన అపరిచిత వ్యక్తి కూడా తనపై లైంగికంగా దాడి చేసినట్టు బాలిక చెప్పడంతో అత్యాచారానికి పాల్పడ్డ బాలిక తండ్రిపైన, అపరిచిత వ్యక్తిపైనా పోలీస్లు కేసులు నమోదు చేశారు.