కూతురిని పెళ్లి చేసుకొని... అత్తతో సంసారం చేశాడు... చివరకు ఇలా దొరికాడు... 

కూతురిని పెళ్లి చేసుకొని... అత్తతో సంసారం చేశాడు... చివరకు ఇలా దొరికాడు... 

అక్రమ సంబంధం అన్నది ఎప్పటికైనా ఇబ్బందే. అలాంటి విషయాలు బయటకు వస్తే కలిగే ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు.  ఇరు కుటుంబాల వ్యక్తులే కాదు, సమాజం కూడా ఛీ కొడుతోంది.  కూతురికోసం కన్న తల్లి ఎంతటి కష్టాన్నైనా అనుభవిస్తుంది.  ఈ సంగతి అందరికి తెలుసు.  కానీ, ఓ  తల్లి తన కూతురి సంసారంలో చిచ్చు పెట్టి, కూతురి భర్తనే పెళ్లి చేసుకుంటే.. ఇంకేమైనా ఉందా.. అసలు ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా చెప్పండి.. 

ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవలే ఇంగ్లాండ్ లో జరిగింది.  ఇంగ్లాండ్ లోని ట్వికెంహం అనే నగరంలో లౌరెన్ వాల్ అనే మహిళ పౌల్ అనే వ్యక్తిని ప్రేమించింది. పౌల్ ద్వారా బిడ్డకు తల్లి అయ్యింది.  అయితే, సమాజంలో బాగుండదు అని చెప్పి ఆమె తల్లి జూలీ, వారిద్దరికి వివాహం జరిపించింది.  పెళ్ళైన తరువాత వాల్, పౌల్ ఇద్దరు హనీమూన్ కు వెళ్లారు.  వీరి చిన్నారి ఆలనా పాలనా చూసుకుంటుందని చెప్పి తల్లి జూలీని కూడా వెంట తీసుకెళ్లారు.  ఇక్కడే అసలైన ట్విస్ట్ జరిగింది.  వాల్ తన బిడ్డను తీసుకొని బయటకు వెళ్ళినపుడు జూలీ, అల్లుడు పౌల్ కు దగ్గరైంది.  ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది.  

విషయం ఏమిటంటే, భార్య వాల్ కంటే అత్తతోనే ఎక్కువగా ఉంటున్నాడు.  చనువుగా ఉంటున్నాడు.  దీనిని పెద్దగా పట్టించుకోలేదు.  ఓరోజు వాల్ చెల్లిదగ్గర తల్లి ఫోన్ ను చూసి షాక్ అయ్యింది.  అందులో తన భర్త పౌల్ తో చాటింగ్ చేసిన విషయాలు ఉన్నాయి.  ఇద్దర్ని నిలదీసింది.  దీంతో ఆ భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు.  కానీ తరువాత కూడా అత్త జూలీతో కలిసి బయట కనిపించాడు.  జూలీ గర్భవతి అయ్యింది.  ఈ విషయం తెలిసి పౌల్ భార్య పాల్ షాక్ అయ్యింది.  ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.