చివర్లో తడబడుతున్నాము : వార్నర్

చివర్లో తడబడుతున్నాము : వార్నర్

ఐపీఎల్ 2020 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడగా అందులో కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి 6 ఓడిపోయింది. దాంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్ 2020 లో నిన్న ఈ జట్టు కోల్‌కత నైట్ రైడర్స్ తో తలపడింది. అయితే ఈ మ్యాచ్ మొదట టై అయ్యింది. దాంతో తర్వాత జరిగిన  సూపర్ ఓవర్ లో కేకేఆర్ విజయం సాధించింది. ఇక ఈ ఓటమి గురించి హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ... ''గత మూడు మ్యాచుల్లో గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయాం. కీలక సమయాల్ల్లో వికెట్లు కోల్పోయాం. మ్యాచ్‌ చివర్లో విఫలమవుతున్నామనే విషయం తెలుస్తుంది. అయితే కేకేఆర్ నిర్ధేశించిన లక్ష్యం ఛేదించదగిందే. కానీ.. ఛేదనలో మా జట్టు కీలక సమయంలో వికెట్లు కోల్పోయింది. విలియమ్సన్‌ గాయంతో ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్‌ చేశాడు. అయితే అతను తర్వాతి మ్యాచ్ లో ఆడుతాడు  అనే నేను అనుకుంటున్నాను అని వార్నర్ తెలిపాడు. ఇక సన్ రైజర్స్ తమ తర్వాతి మ్యాచ్ ఈ నెల 22న రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది.