కోహ్లీ జట్టు పరువు తీసేసిన వార్నర్...

కోహ్లీ జట్టు పరువు తీసేసిన వార్నర్...

భారత్ లో టిక్ టాక్ బ్యాన్ కాకముందు ఆస్ట్రేలియా ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన వీడియోల కారణంగా తరచు వార్తలో ఉండేవాడు. కానీ ఆ యాప్ ను భారత ప్రభుత్వం బ్యాన్ చేయడంతో భారత అభిమానులకు దూరం అయ్యాడు. కానీ ఇప్పుడు తన పోస్ట్ కారణంగా మళ్ళీ వార్తలో నిలిచాడు. అసలు ఏం జరిగిందంటే.. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ యూఏఈ వేదికగా జరుగుతుంది. దాంతో ఐపీఎల్ టైటిల్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ''ఎవరు గెలుస్తారు'' అని అభిమానులను ప్రశ్నించాడు. వార్నర్ ప్రశ్నకు సమాధానంగా... ఎక్కువ మంది సన్ రైజర్స్ గెలుస్తుంది అని చెప్పారు. కానీ కొంతమంది మాత్రం తమకు నచ్చిన జట్టు పేరు చెప్పగా దాని పై వార్నర్ స్పందించాడు. అయితే ఒకరు కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధిస్తుంది అని చెప్పగా '' వారిని ఓడించడం కొంచెం కష్టం'' అని చెప్పాడు. మరొకరు కోహ్లీ న్యాయకత్వం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పేరు చెప్పగా ''నిజామా??'' అంటూ ఎటకారంగా వార్నర్ అన్నాడు. అయితే బెంగళూర్ ఇప్పటికి 3 సార్లు ఫైనల్ కు చేరుకోగా ఒకసారి కూడా టైటిల్ అందుకోలేదు. ఇక అందులో 2016 సీజన్ లో కోహ్లీ జట్టు పైన విజయం సాధించి వార్నర్ జట్టు  టైటిల్ అందుకుంది.