2016 సీన్ రిపీట్ అవుతుంది : వార్నర్

2016 సీన్ రిపీట్ అవుతుంది : వార్నర్

ఐపీఎల్ 2016 సీజన్ లో టైటిల్‌ అందుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ సీజన్‌లోనూ అలాంటి ఫలితాలే సాధిస్తుందని ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అప్పుడు చివరి మూడు మ్యాచ్‌లు గెలవాల్సి రావడంతో గెలిచి టైటిల్ సాధించామని, ఇప్పుడు కూడా మరో మ్యాచ్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడుతూ... ఈ మ్యాచ్‌కు ముందు విజయ్‌ శంకర్‌ను కోల్పోవడం పెద్దలోటు. టాప్ ఆర్డర్‌లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. అయితే అవి బాగా కలిసొచ్చాయి. 'మేం సరైన జట్టుతో కచ్చితమైన భాగస్వామ్యాలు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాం. చివరకు ఓ మార్గం కనుకొన్నాం. దుబాయ్‌లో తేమ ప్రభావం ఉంది. జాసన్ హోల్డర్‌ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌. అతడికి బౌన్స్‌ వేయాలంటే కాస్త ఆలోచించాలి. హోల్డర్ నిలకడగా రాణించడం గొప్ప విశేషం' అని డేవిడ్‌ వార్నర్‌ ప్రశంసించాడు.