వార్నర్‌ చేసిన పనికి ఆ ఫ్యాన్‌ ఫుల్‌ హ్యాపీ

వార్నర్‌ చేసిన పనికి ఆ ఫ్యాన్‌ ఫుల్‌ హ్యాపీ

వరల్డ్‌కప్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్‌ డాషింగ్‌ బ్యాట్సమన్‌ డేవిడ్‌ వార్నర్‌.. నిన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీ సాధించాడు. ఏడాదిపాటు నిషేధానికి గురైనా వార్నర్‌ ఫామ్‌లో తేడా లేదు.. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ మాత్రమూ తగ్గలేదు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ఆసీస్‌ ఫ్యాన్స్‌ అతనిలో జోష్ నింపారు. ముఖ్యంగా.. కొంతమంది చిన్న పిల్లలు వార్నర్‌ బ్యాటింగ్‌ విన్యాసాలు చూసి 'వార్నర్‌..వార్నర్‌' అంటూ చీర్స్‌ చెప్పారు. ఈ ఫ్యాన్స్‌ ప్రేమకి వార్నర్‌ ఫిదా అయ్యాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం తన 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జ్ఞాపికను ఫ్యాన్స్‌ గ్యాలేరీలో ఉన్న ఓ చిన్నారికి ఇచ్చేశాడు. వార్నర్‌ చేసిన పనికి ఆ పిల్ల ఫ్యాన్‌ ఫుల్‌ హ్యాపీగా ఫీలయ్యాడు.